
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
కొల్చారం(నర్సాపూర్): వరి సాగు చేసి నష్టపోతున్న రైతులు, ఆయిల్ పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సూచించారు. శుక్రవారం మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో జిల్లా ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్‌సింగ్, జడ్పీసీఈఓ చేతుల మీదుగా రైతు జగదీష్ పొలంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు 90 శాతం సబ్సిడీపై అవసరమైన మొక్కలు, డ్రిప్ ఇస్తుందన్నారు. జిల్లాలో 2025–26 సంవత్సరానికి 2500 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. ఇప్పటివరకు 1545 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. అందులో నుంచి 771 ఎకరాలు ఆయిల్ పామ్ తోటలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ శ్వేతా కుమారి, ఏఈఓలు రాజశేఖర్ రెడ్డి, నిరోషా, కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లోని ప్రతి కాలనీ పరిశుభ్రంగా ఉండాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని ధర్మాసాగర్‌లో డ్రైడే కార్యక్రమంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత డబ్బాలు, కొబ్బరి బోండాలు, టైర్లు, నిరుపయోగంగా ఉండే నీటితొట్లలో నీరు నిలువలేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఏ పుణ్యదాస్, పంచాయతీ కార్యదర్శి నరహరి, అంగన్‌వాడీ టీచర్ పద్మ, ఆశవర్కర్ మంజుల పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య