
అద్దెకుండే వారి వివరాలు తీసుకోవాలి
● కార్డన్ సర్చ్‌లో 80 వాహనాలు సీజ్
● తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్
మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమల వాడ కావడంతో అద్దెకు వచ్చే వారి వివరాలను తప్పనిసరిగా యజమానులు తీసుకోవాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. గురువారం మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్‌లో వేకువజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి ఇండ్లలో అద్దెకుండే వారి వివరాలు సేకరించారు. అంతే కాకుండా ఇండ్ల మధ్య బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి 250 మద్యం బాటిల్లు, 50 బీరు బాటిల్స్‌ను సీజ్ చేశారు. ఎలాంటి ధ్రువ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఇందులో 80 బైక్‌లు, రెండు ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. అలాగే వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు రూ. 87,895 ఆన్‌లైన్‌లో క్లియర్ చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో డీఎస్పీ మాట్లాడుతూ... గ్రామాల్లో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్‌గౌడ్, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు
● దుర్వాసనతో స్థానికుల విలవిల
జిన్నారం(పటాన్‌చెరు): గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలను పారబోసిన ఘటన ఖాజీపల్లి పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా... గడ్డపోతారం మున్సిపాలిటీ ఖాజీపల్లి పరిధిలోని సర్వేనం.181 వనదుర్గాదేవి ఆలయ సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థాలను సంచుల్లో తీసుకొచ్చి పారబోశారు. దీంతో ఆ ప్రాంతమంతా వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో ఊపిరితీసుకోలేని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా సమీప చెరువు, కుంటలకు ఆ వ్యర్థాలు చేరి తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పీసీబీ అఽధికారులు స్పందించి వ్యర్థాలు పారబోసిన పరిశ్రమపై, క్షేత్ర స్థాయిలో గుర్తించి బాధ్యులపై కఠిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అద్దెకుండే వారి వివరాలు తీసుకోవాలి