
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..
గజ్వేల్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మండల పరిధిలోని కొల్గూరు గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కర్రొల్ల ప్రశాంత్(21) సిద్దిపేటలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లికి చెందిన మర్పడగ(గాజులపల్లి) రాజిరెడ్డి(38) పెయింటర్‌గా పనిచేస్తూ గజ్వేల్‌లో నివసిస్తున్నాడు. ప్రశాంత్ తన పని ముగించుకొని సిద్దిపేట నుంచి కొల్గూరు గ్రామానికి స్కూటీపై బయలుదేరాడు. ఇదే క్రమంలో గజ్వేల్ నుంచి రాజిరెడ్డి కూడా బైక్‌పై వస్తున్నాడు. కొల్గూరు దాటిన తర్వాత పెద్దమ్మ గుడి సమీపంలో వీరిద్దరు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదా తెలిపారు.
ఇద్దరు వ్యక్తులు మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..