
ఎండు గంజాయి స్వాధీనం
మునిపల్లి(అందోల్): ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేశారు. బుదేరా ఎస్‌ఐ రాజేశ్ నాయక్ వివరాల ప్రకారం... మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు, సిబ్బంది గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్‌కు యాక్టివాపై మొహమ్మద్ సమీర్ (35) గంజాయిని తరలిస్తుండగా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపించారు. అతడి వద్ద సుమారు 6.400 కిలో గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీదర్ లోని ఇరాన్ గల్లీలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఏఎస్‌ఐ బక్కన్న, సి బ్బంది ఎండి, హనీఫ్, పాండు, సునీల్ పాల్గొన్నారు.
నిందితుడి రిమాండ్