వావిలాల ఇక పారిశ్రామికవాడ! | - | Sakshi
Sakshi News home page

వావిలాల ఇక పారిశ్రామికవాడ!

Jun 15 2025 9:18 AM | Updated on Jun 15 2025 9:18 AM

వావిల

వావిలాల ఇక పారిశ్రామికవాడ!

● కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు ● ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు

జిన్నారం (పటాన్‌చెరు): పరిశ్రమల స్థాపన ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని లక్ష్యంతో అధికారులు పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతంగా జిన్నారం మండలంలోని గడ్డపోతారం కాజీపల్లి బొల్లారం ఉన్నాయి. వీటికితోడు నూతన పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసే దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గడ్డపోతారం మున్సిపల్‌ పరిధిలోని వావిలాల గ్రామాన్ని పారిశ్రామికవాడగా రూపొందించేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక రంగాన్ని నెలకొల్పేందుకు కసరత్తు ప్రారంభించారు. స్థానిక సర్వే నంబర్‌ 190లో 40 ఎకరాలు 110 పరిశ్రమలకు కేటాయింపులు చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడ ఏర్పాటుతో అభివృద్ధిని వేగవంతం చేసేలా ముందుకు వెళ్తున్నారు.

కాలుష్య రహిత ప్రాంతంగా ప్రణాళికలు

జిన్నారం మండలంలో రసాయన పరిశ్రమలను ఇప్పటికే ఏర్పాటు చేసి కాలుష్యమయంగా మారింది. ప్రస్తుతం వావిలాలలో కాలుష్య రహిత పారిశ్రామికవాడ ఏర్పాటుకు అధికారులు నడుం బిగించారు. మధ్య సూక్ష్మతరహా పరిశ్రమల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. బాలనగర్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఇంజనీరింగ్‌ పరిశ్రమ యూనిట్లను వావిలాలకు తరలించే విధంగా కసరత్తు జరుపుతున్నారు. 40 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా ఇప్పటికే 20 ఎకరాలు కేటాయించారు. ఇక మిగిలి ఉన్న మరో 20 ఎకరాలను కేటాయించి పరిశ్రమల స్థాపనకు మొగ్గుచూపుతున్నారు. గ్రామంలో భారీ మధ్య సూక్ష్మతరహా పరిశ్రమలను నెలకొల్పితే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవడమే కాకుండా, వావిలాల నాలుగో పారిశ్రామికవాడగా రానున్న రోజుల్లో అభివృద్ధిలోకి వెళ్తుంది. వావిలాల గ్రామంలో పారిశ్రామికవాడ ఏర్పాటు దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారని గ్రామాల్లోని యువకుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని వేచి చూస్తున్నారు.

స్వాగతిస్తున్నాం

కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తాం. స్థానికంగా కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు స్వాగతిస్తాం. ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మొదటి ప్రాధాన్యత కల్పించాలి.

–మాజీ ఎంపీపీ రవీందర్‌ గౌడ్‌, (జిన్నారం మండలం)

వావిలాల ఇక పారిశ్రామికవాడ! 1
1/1

వావిలాల ఇక పారిశ్రామికవాడ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement