చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Published Thu, Apr 18 2024 10:35 AM

వెంకటేశం మృతదేహం - Sakshi

నిజాంపేట(మెదక్‌): చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెక్‌డ్యామ్‌లో మునిగి వ్యక్తి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి నిజాంపేట మండల పరిధిలోని నస్కల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్‌ గ్రామానికి చెందిన నీరటి వెంకటేశం(46) మంగళవారం మధ్యాహ్నం నస్కల్‌ శివారులోని కాల్వలో చేపలు పట్టడానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుమారుడు, భార్య చెరువులో, కాల్వలో, గ్రామ శివారులో గాలించినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు వెతుకుతున్నారు. కాల్వ పక్కనే ఉన్న చెక్‌ డ్యామ్‌లో మునిగిపోయి ఉండొచ్చని అనుమానంతో వెతకగా కాళ్లుపైకి తేలి కనిపించాయి. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చిక్కుకొని చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుడికి భార్య నీరటి కళావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement