
దౌల్తాబాద్ లో మాట్లాడుతున్న ఆవుల రాజిరెడ్డి
హత్నూర (సంగారెడ్డి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే ఆరు గ్యారంటీలపై నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి బాండ్ పేపర్ ను హత్నూర మండలం దౌల్తాబాద్ ఎల్లమ్మ దేవాలయంలో సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఆవుల రాజిరెడ్డి అనే నేను... హామీ ఇస్తున్న... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని మాట ఇస్తున్నట్లు బాండ్ పేపర్ పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ అని, ఆరు గ్యారంటీలు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని మండలానికో స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని, కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలల నిర్మాణం చేపడుతామని తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని, వాటిని ప్రజలు నమ్మరని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి హకీమ్, నాయకులు రవీందర్ రెడ్డి, సర్పంచ్ కొన్నాల వెంకటేశం, ఉప సర్పంచ్ రియాజ్ అలీ ఉన్నారు.
హత్నూర(సంగారెడ్డి): కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అవినీతిమయంగా సాగిందని నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ లో రాజిరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క గ్రామం అభివృద్ధి చెందలేదన్నారు. బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదని విమర్శించారు. కమీషన్ల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కేసీఆర్ మాటలకు ప్రజలు రెండుసార్లు మోసపోయారని, మూడోసారి అందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంజనేయులుగౌడ్, రవీందర్‌రెడ్డి, హకీం, సుజాత, కృష్ణ, వెంకటేశం, కృష్ణ పాల్గొన్నారు.
నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి