చాదర్‌ఘాట్: శని, ఆదివారాలు రెండు రోజులు సెలవు నేపథ్యంలో మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌కు వివిధ రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డ శుక్రవారం భారీగా దిగుమతి అయ్యింది. కర్ణాటక నుంచి 96 లారీలు, మహారాష్ట్ర నుంచి 46 లారీలు, కర్నూలు నుంచి 24 లారీల ఉల్లి దిగుమతి అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. క్వింటాకు రూ.4,700 నుంచి రూ.5,000 వరకు ధర పలికినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో శుక్రవారం వచ్చిన ఉల్లి అత్యధికమని వ్యాపారస్తులు తెలిపారు. అయినప్పటికీ ఉల్లి ధర ఏమాత్రం తగ్గలేదని అధికారులు తెలిపారు. దాదాపు నెలరోజుల పాటు ఈ రేటు ఇలాగే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.


