కేశంపేట: భూ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని షాద్‌నగర్ ఆర్డీఓ సరిత అన్నారు. మండల పరిధిలోని చింతకుంటపల్లిలో జరుగుతున్న భూసర్వే పనులను శుక్రవారం తహీసీల్దార్ రాజేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. రికార్డులతో పాటు భూముల యజమానుల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి సర్వేను కొనసాగించాలని అన్నారు. సర్వేలో ఏలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకోవాలని అమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోచమోని రమేష్‌యాదవ్, సర్వేయర్ వెంకటేశ్, మల్లేష్ యాదవ్, రఘుమారెడ్డి, జంగయ్య యాదవ్, ప్రవీణ్, నవీన్, నరేష్, రమేష్, అనిల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


