అనంతగిరి: విదేశీ పర్యటన ముగించుకొని శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. యూరప్ పర్యటన విజయవంతంగా ముగించుకొని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు వికారాబాద్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు బొకేలు అందజేసి సన్మానించారు.
మార్కెట్ యార్డును
అభివృద్ధి చేస్తాం
మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్
కొడంగల్ రూరల్: కొడంగల్ మార్కెట్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్ తెలిపారు. యార్డులో పది దుకాణాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. త్వరలో మరికొన్ని దుకాణాల నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం మార్కెట్ యార్డులో కమీషన్ ఏజంట్లు, ట్రేడర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యార్డులో రూ.10 కోట్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వ్యాపారులు, ఏజంట్లు, రైతులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యార్డ్ అభివృద్ధికి మరో రూ.5 కోట్లు విడుదలైనట్లు చెప్పా రు. ఈ నిధులతో మరికొన్ని దుకాణాలు నిర్మి స్తామని తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు మల్లేశం, జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్, కార్యదర్శి హబీబ్‌ఆల్వీ, మార్కెట్ చైర్మన్ అంబయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కుల్కచర్లలో కార్డెన్ సెర్చ్
కుల్కచర్ల: నేరాల నియంత్రణ, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంపొందించడమే లక్ష్యంగా కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లుపరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారంమండల కేంద్రంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, పోలీసు చట్టాలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, 34 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు రౌడీ షీటర్ల జీవనపరిస్థితిని పరిశీలించారు. కార్యక్రమంలో పరిగి సీఐ కొండల్ రెడ్డి, కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


