చేయూత పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

చేయూత పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన

Oct 10 2026 7:56 AM | Updated on Oct 10 2026 7:56 AM

చేయూత పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన కడ్తాల్‌: మండల పరిధిలోని కర్కల్‌పహాడ్‌లో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఇప్పటికే చేయూత పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వాటిని క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎంపీడీఓ సుజాతతో కలిసి జెడ్పీ సీఈఓ కర్కల్‌పహాడ్‌లోని పంచాయతీ కార్యాలయంలో పింఛన్లకు ఎంపిక చేసిన దరఖాస్తు దారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు పారదర్శకంగా ఉన్నాయా లేదా విచారించారు. కార్యక్రమంలో ఎంపీఓ లాలయ్య, సర్పంచ్‌ తేజీరాంనాయక్‌, కార్యదర్శి జంగయ్య, తదితరులు పాల్గొన్నారు. రీసర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి కొందుర్గు: రీసర్వే పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా సర్వే పనులు పారదర్శకంగా పూర్తి చేయాలని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం తూంపల్లిలో కొనసాగుతున్న రీసర్వే పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. తూంపల్లికి శివారు గ్రామమైన ఇంద్రానగర్‌ సరిహద్దుల్లో సర్వేనంబర్‌ 226, 227, 228, 229, 230, 231లో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారంలో భాగంగా రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ భాస్కర్‌, ఆర్‌ఐ రాంబాబు, జీపీఓ నవీన్‌, సర్వేయర్‌ శ్రీనివాసు పాల్గొన్నారు. ఓంకారేశ్వరాలయ భూములపై డ్రోన్లు యాచారం: నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములపై శుక్రవారం డ్రోన్ల సంచరించాయి. నాలుగైదు వరకు డ్రోన్లు నందివనపర్తి, నస్దిక్‌సింగారం, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని ఆలయ భూమితో పాటు పలు పట్టా సర్వేనంబర్ల వ్యవసాయ భూములపై సంచరించాయి. ఉదయం పది నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాలపై, వ్యవసాయ, ఆలయ భూములపై డ్రోన్లు సంచరించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గతంలో కొత్తపల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో అసైన్డ్‌ భూముల సేకరణకు ముందు ఇలానే డ్రోన్లు రాత్రి, పగలు తేడా లేకుండా సంచరించాయి. అదే మాదిరిగా ప్రస్తుతం నందివనపర్తి ఓంకారేశ్వరాలయ భూములపై సంచరించడంతో కలవరం నెలకొంది. ఏటీఎఫ్‌పై రాయపోల్‌ గ్రామస్తుల వ్యతిరేకత

ఇబ్రహీంపట్నం: ఏటీఎఫ్‌ (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌) పైపులైన్‌ ప్రాజెక్ట్‌ను రాయపోల్‌ గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. మల్కాపురం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు బీపీసీఎల్‌ (భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఆధ్వర్యంలో ఇంధన పైపులైన్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ప్రజాభిప్రాయ సేకరణకు శుక్రవారం రాయపోల్‌లో గ్రామసభ నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పైపులైన్‌ నిర్మిస్తున్నప్పటికీ జనావాసాల మధ్య నుంచి ఇంధనాన్ని తరలించడం ఆందోళన కలిగించే అంశంగా గ్రామస్తులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం సంభవించి ఇంధనం లీకై తే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అలివేలు, ఉప సర్పంచ్‌ శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీశైలం, బీపీసీఎల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement