ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు

Oct 10 2026 7:56 AM | Updated on Oct 10 2026 7:56 AM

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహించిన కార్మిక సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. కార్మికులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిపోలో మొత్తం 284 ఓటర్లకు గాను 282 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 99.30 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంతంగా ముగిసాయి.

ఇబ్రహీంపట్నం డిపోలో 633 ఓట్లు పోల్‌

ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్మికుల ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిపోలో 635 ఓట్లకు గాను 633 పోలయ్యాయి. ఏసీపీ కేవీపీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాల్లో బాణం గుర్తు (టీడబ్ల్యూయూ) ఘన విజయం సాధించింది. ఫలితాల్లో టీడబ్ల్యూయూ (బాణం గుర్తు)కు 393 ఓట్లు రాగా టీఎంసీ (నిచ్చెన గుర్తు)కు 149 ఓట్లు వచ్చాయి. 244 ఓట్లతో టీడబ్ల్యూయూ ఘన విజయం సాధించింది. ఇతర యూనియన్లకు 91 ఓట్లు డిపో స్థాయిలో పడ్డాయి. రాష్ట్ర స్థాయి ఫలితాల్లో టీడబ్ల్యూయూకు 325 ఓట్లు రాగా ఈయూ (బస్సు గుర్తు) 265 ఓట్లు దక్కించుకుంది. 60 ఓట్ల మె జార్టీని బాణం గుర్తు సాధించింది. ఇతరులకు 43 ఓట్లు దక్కాయి. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారిగా అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ ప్రమీల వ్యవహరించారు. డిపో వద్ద ఘన విజయం సాధించిన తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ కూటమి నేతలు సంబరాలు జరుపుకొన్నారు. స్థానిక ఏసీపీ కేవీపీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు.

మహేశ్వరంలో 99.7 శాతం పోలింగ్‌

మహేశ్వరం: మహేశ్వరం డిపో ఆవరణలో శుక్రవారం ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మొత్తం 345 ఓట్లు ఉండగా 344 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, 99.7 శాతం ఓటింగ్‌ నమోదైందని డిపో ఎన్నికల అధికారి రేణుక, మేనేజర్‌ ప్రకాష్‌ రావు తెలిపారు. టీఎంయూ కూటమి విజయం సాధించింది. టీఎంయూ, టీడబ్ల్యూయూ ప్రధానంగా పోటీ పడగా 72 ఓట్ల తేడాతో టీఎంయూ గెలుపొందింది. యూనియన్ల వారీగా టీఎంయూకు 175, టీడబ్ల్యూయూకు 103, టీజేఎంయూకు 61, బీకేయూకు ఒక్క ఓటు పడగా, ఒక ఓటు చెల్లకుండాపోయింది. విజయం సాధించిన టీఎంయూ నేతలు డిపోలో సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement