ఆమనగల్లు: ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 6న జరుగనున్న ఎంఎస్‌ఎఫ్ జాతీయ ప్రతినిధుల సభకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎంఆర్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు. పట్టణంలో ఆదివారం సంఘం మండల అధ్యక్షుడు వస్పుల శ్రీరామ్‌మాదిగ అధ్యక్షతన ఎంఆర్‌పీఎస్, అనుంబధ విభాగాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి విజయం సాధించిన ఎంఆర్‌పీఎస్ ఉద్యమం నేడు అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా బలమైన ప్రజా పోరాటాలు కొనసాగిస్తోందని తెలిపారు. విద్యార్ధి ఉద్యమన్ని బలోపేతం చేసేందుకు, మాదిగ విద్యార్థులను ఒక శక్తిగా మలుచుకోవాలని, అందుకోసం ఎంఆర్‌పీఎస్ ఉద్యమానికి అనుబంధంగా ఎంఎస్‌ఎఫ్‌ను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 6న ఓయూలో నిర్వహించే సదస్సుకు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారని చెప్పారు. సమవేశంలో ఎంఎస్‌పీ జిల్లా మాజీ అధ్యక్షుడు రావుగళ్ల బాబు మాదిగ, నాయకులు శ్రీశైలం, విజయ్‌మాదిగ, రాకేశ్, విజయ్, సూరి, శ్యాంసన్, శివరాం, పర్వతాలు, భరత్, సైదులు, చరణ్ తదితరులు ఉన్నారు.
ఎంఆర్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి ఉపేందర్ మాదిగ


