● బీఆర్ఎస్ చేసిన పనులకు కొబ్బరి కాయలు కొట్టడం తప్ప
● మాజీ మంత్రి సబితారెడ్డి
మొయినాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభిస్తున్నారని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీలోని పీవీ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన పార్టీ చేవెళ్ల నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మూడేళ్ల కాంగ్రెస్ పాలన చూశారని.. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే వినాయక నిమజ్జనం సందర్భంగా సెక్రటేరియేట్ వద్దకు రాగానే కేసీఆర్ పాటలు పెట్టి ఆయన్ను గుర్తుచేసుకున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో జరగబోయే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలకోసం ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. గ్రాడ్యూయేట్లందరిచే ఓటరు నమోదు చేయించి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించేలా చూడాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయుడు కార్తీక్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, పార్టీ మండల అధ్యక్షులు దారెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, గోవర్దన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, నర్సింగ్‌రావు. మైనార్టీ నాయకుడు మహబూబ్, నాయకులు నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


