హుడాకాంప్లెక్స్: చైతన్యపురిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా న్యాయ కళాశాలలో ఈనెల 9న (శుక్రవారం) స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.మానస ఆధివారం ఒక ప్రటకనలో పేర్కొన్నారు. లాసెట్ 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో జరిగే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని తెలిపారు. మొత్తం 20 సీట్లను మెరిట్ ప్రకారంగా ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలకు 96036 17134 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ప్రమాద బాధితుడు రాంరెడ్డి
ధారూరు: డ్రైవర్ వాసునాయక్ బస్సును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని పటాన్‌చెరువు మున్సిపల్ పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన అత్తెల్లి రాంరెడ్డి శనివారం ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను అదే బస్సులో ఉన్నానని డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే తమ బంధువులు మృతి చెందారని తెలిపారు. నలుగురు చనిపోవడానికి, పలువురు తీవ్రంగా గాయపడటానికి కారణమైన డ్రైవర్ వాసునాయక్‌పై తగిన చర్య తీసుకోవాలని కోరారు. ప్రమాద స్థలం నుంచి పారిపోయిన డ్రైవర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
మోమిన్‌పేట: జిల్లా ఉత్తమ వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్‌గా మోమిన్‌పేటకు చెందిన మణిందర్ ఎంపికయ్యారు. శుక్ర, శనివారాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన ఫొటో గ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి శంషా బాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో అవార్డులను ప్రకటించారు. అందులో మోమిన్‌పేటకు చెందిన మణిందర్ ఎక్సుపో భారత్ కళా పురస్కార్ అవార్డును రాష్ట్ర ఫొటో గ్రాఫర్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ చేదుల మీదుగా అందుకున్నారు.
కొడంగల్: దుద్యాల మండలం చెట్టుపల్లి తండా, కుదురుమళ్ల గ్రామాల్లో సోమవారం పలు భవనాలను ప్రారంభించనున్నట్లు సర్పంచులు గోపాల్, లాలప్ప తెలిపారు. చెట్టుపల్లితండాలో రూ.30 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, కుదురుమళ్లలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, ఆయా శాఖల అధికారు లతో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్
తాండూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్ అన్నారు. ఆదివారం తాండూరులోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులను కలిసి ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్‌కుమార్, రజినీకాంత్, బంటా రం భధ్రేశ్వర్, సాయిరెడ్డి, నాగారం మల్లేశం, అంతారం కిరణ్‌కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


