ఊరుముందు కుంటను అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఊరుముందు కుంటను అభివృద్ధి చేస్తాం

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

ఊరుముందు కుంటను అభివృద్ధి చేస్తాం అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు ఫామ్‌హౌస్‌ కేసులో నిందితులను అరెస్ట్‌ చేయాలి

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మొయినాబాద్‌: మున్సిపల్‌ పరిధిలోని పెద్దమంగళారం ఊరుముందు కుంటను అభివృద్ధి చేసి, సుందరీకరణ పనులు చేపడతామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కుంటను పరిశీలించి మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, డీఈ జిరంజీవులు, కౌన్సిలర్లు మమతారెడ్డి, అరుణ, స్థానికులతో కలిసి అభివృద్ధిపై చర్చించారు. తన సొంత నిధులతో గుర్రపుడెక్కను తొలగిస్తానని చెప్పారు. అనంతరం చందానగర్‌–కవేలిగూడ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, బీజేపీ రాష్ట్ర నాయకులు అంజన్‌కుమార్‌గౌడ్‌, కంజర్ల ప్రకాష్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ రామకృష్ణగౌడ్‌ తదితరులు ఉన్నారు.

యాచారం: పీఏసీఎస్‌లో దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులు ఇప్పటికై నా అప్పులు చెల్లించాలని డీసీసీబీ జాయింట్‌ రిజిస్ట్రార్‌ మనోజ్‌కుమార్‌రెడ్డి సూచించారు. రుణాలు పొంది సకాలంలో చెల్లించని 300 మందికి మంగళవారం ఆయన నోటీసులు జారీ చేశారు. మూడేళ్లుగా యాచారం పీఏసీఎస్‌లో రుణాలు సక్రమంగా వసూలు కావడం లేదని, దీంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త రైతులు అవకాశం కోల్పోతున్నారని అన్నారు. ఈనెల చివరి లోపు అప్పులతో కూడిన బకాయిలు చెల్లిస్తేనే సరి లేదంటే ఆస్తుల జప్పు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ సీఈఓ నాగరాజు, సిబ్బంది ఉన్నారు.

చేవెళ్ల: మొయినాబాద్‌ మండలంలోని కనకమామిడి ఫామ్‌హౌస్‌ కేసులో కొడిచెర్ల సాయికుమార్‌ మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు నరేందర్‌, జిల్లా కార్యదర్శి శివశంకర్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏసీపీ కిషన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగి 20 రోజులు అవుతున్నా ఈ కేసులో ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనిపై పోలీస్‌ ఉన్నతాధికారులు కల్పించుకొని, నిందితులను అరెస్ట్‌ చేసి బాధితకుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఊరెంట ప్రవీణ్‌, నరేశ్‌, ప్రేమ్‌సాగర్‌, నగేశ్‌, రాజు, తదితరులు ఉన్నారు.

వెల్జర్లలో విషాదఛాయలు

షాద్‌నగర్‌: బిడ్డ బంగారు భవిష్యత్తును ఆశించిన తల్లిదండ్రుల ఆశ నెరవేర లేదు. బంగారు భవిష్య త్తు కోసం రెక్కలు ముక్క లు చేసుకొని కొడుకును చదివిస్తే అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో షాద్‌నగర్‌ పరిధిలోని వెల్జర్లకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బాలమణి, కృష్ణయ్యల కుమారుడు కార్తీక్‌ (26) పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం తోటి స్నేహితులు గుర్తించి వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. తండ్రి కృష్ణయ్య సోమ వారం ఉదయమే కొడుకును హాస్టల్‌లో విడిచిపెట్టివచ్చాడు. కార్తీక్‌కు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియరాలేదు. మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement