మచ్చుకు కొన్ని.. | - | Sakshi
Sakshi News home page

మచ్చుకు కొన్ని..

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

మచ్చుకు కొన్ని..

● సురంగల్‌ రెవెన్యూలోని దర్గ చెరువు సుమారు 15 ఏళ్ల క్రితమే పూర్తిగా కబ్జాకు గురైంది. చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం చెరువు ఆనవాళ్లే లేకుండా పోయాయి.

● పెద్దమంగళారం రెవెన్యూలోని ఎల్లమ్మకుంట శిఖం భూమిలో పదేళ్ల క్రితం వెంచర్‌ చేసి ప్లాట్లు విక్రయించారు. ప్రస్తుతం శిఖం భూమిలో చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

● సురంగల్‌ రెవెన్యూలోని మామిళ్ల కుంట కట్టను తొలగించి ఆనవాళ్లు లేకుండా చేశారు. శిఖంలో మొత్తం ప్లాట్లు చేసి విక్రయించారు. ప్రస్తుతం నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి.

● అమ్డాపూర్‌లోని పటేల్‌ కుంట శిఖం భూమిలో అక్రమంగా మట్టిపోసి పూడుస్తున్నారు. నాలుగైదు రోజులుగా టిప్పర్ల ద్వారా మట్టి తెచ్చి పూడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

● చిలుకూరు పెద్ద చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. గత ఏడాది భారీ వర్షాలకు పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి శిఖంలో చేపట్టిన నిర్మాణాల్లోకి నీళ్లు వెళ్లాయి. ప్రస్తుతం శిఖంలో మట్టిపోసి ఎత్తు పెంచుతున్నారు.

● పెద్దమంగళారం పెద్ద చెరువు శిఖంలో మట్టిపోసి ఎత్తు పెంచుతున్నారు.

● పెద్దమంగళారం బిజినికుంట శిఖం భూమిలో ప్రీకాస్ట్‌ గోడలు నిర్మించారు.

● పెద్దమంగళారం ఊరుముందు కుంటలో అక్రమ నిర్మాణాలు జరిగాయి.

● కేతిరెడ్డిపల్లి రెవెన్యూలో ఉన్న కంచిమోనిగూడ కుంటను ఆనవాళ్లు లేకుండా చేసి ప్లాట్లు చేసి విక్రయించారు. అందులో నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

● చిలుకూరు అంతప్పచెరువు శిఖంలో ప్రీకాస్ట్‌వాల్స్‌, షెడ్లు నిర్మించారు.

● చిలుకూరు పడమటి చెరువులో నుంచి ప్రైవేటు వెంచర్‌లోకి రోడ్డు వేశారు.

● మేడిపల్లిలోని ఊరుముందు కుంట, కుమ్మరికంట, ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు, షెడ్లు నిర్మించారు.

● కనకమామిడిలోని దమ్మాయి కుంటలో ప్రీకాస్ట్‌ వాల్స్‌ నిర్మించారు.

● బాకారంలోని జంబుల కుంట శిఖంలో ఆక్రమణలు జరుగుతున్నాయి.

● నాగిరెడ్డిగూడలోని అబ్బుకుంట శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చెరువులోనుంచే ప్రైవేటు వ్యక్తులు రోడ్డు వేశారు.

● నజీబ్‌నగర్‌లోని సింగారం చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు జరిగాయి. చెరువు అలుగు కింది భాగంలో కాలువకు అడ్డంగా ప్రహరీ నిర్మించారు. దీంతో గతంలో చెరువు కట్ట తెగిపోయింది. ఇటీవలే సుమారు రూ.40 లక్షలు మంజూరు కావడంతో గండిని పూడ్చి మరమ్మతులు చేశారు. అలుగు కిందిభాగంలో నిర్మించిన ప్రహరీ తొలగించకపోవడంతో వర్షాలు పడి చెరువు నిండితే మళ్లీ కట్ట తెగే ప్రమాదం ఉంది.

● కేతిరెడ్డిపల్లిలోని వెంకటమ్మ చెరువు శిఖంలో ఫాంహౌస్‌లు, భవనాలు నిర్మించారు.

● హిమాయత్‌నగర్‌లోని బూరుగుకుంట శిఖంలో మట్టి నింపి నిర్మాణాలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement