ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్‌సిటీ | - | Sakshi
Sakshi News home page

ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్‌సిటీ

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

కందుకూరు: ఫ్యూచర్‌సిటీని అత్యంత ప్రమాణాలతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ఫ్యూచర్‌సిటీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఎఫ్‌సీడీఏ భవనంతో పాటు సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏఐ సిటీతో పాటు డాటా సెంటర్ల వంటివి ఏర్పాటు కానున్నాయన్నారు. ఇక్కడ నెలకొల్పే సంస్థలో పని చేయడానికి నైపుణ్య శిక్షణ కోసం యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఫ్యూచర్‌సిటీలో నెలకొల్పే ప్రతి సంస్థ కాలుష్యరహితంగానే పని చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఎంత అడ్డు తగులుతున్నా ఇక్కడి ప్రజల కోసం చేపట్టిన నగర నిర్మాణాన్ని ఆపేదిలేదన్నారు. భవిష్య నగరానికి పునాదులు వేస్తున్నామని, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎఫ్‌సీడీఏ భవనం ప్రారంభోత్సం, అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, టీజీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక, టీపీసీసీ ప్రధానకార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్‌రెడ్డి, సరికొండ మల్లేష్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు

Advertisement
 
Advertisement
Advertisement