తాగునీటి కోసం ట్యాంకు ఎక్కి నిరసన | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం ట్యాంకు ఎక్కి నిరసన

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

మీర్‌పేట: తాగునీటి సదుపాయం కల్పించాలని లెనిన్‌నగర్‌ డబుల్‌ బెడ్రూం వాసులు మంగళవారం ఖాళీ బిందెలతో ట్యాంక్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లలోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా మంచినీటి సౌకర్యం కల్పించలేదని, కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు జిల్లా, స్థానిక ఎమ్మెల్యే, హౌసింగ్‌ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇటీవల ఉన్న ఒక్కగానొక్క బోరు కూడా పాడైపోయిందన్నారు. ఆనుకునే మిషన్‌ భగీరథ ట్యాంకు ఉన్నప్పటికీ మంచినీరు తాగే భాగ్యం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న జలమండలి అధికారులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే మంచినీటి సరఫరాకు సంబంధించి పైపులైన్‌ పనులు ప్రారంభించి కనెక్షన్‌ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ నీలారవినాయక్‌, స్థానిక బీజేపీ అధ్యక్షుడు భిక్షపతిచారి, ముఖేష్‌ ముదిరాజ్‌, చెవ్వ శ్రవణ్‌, తిరుపతిరెడ్డి, పూజారి శంకర్‌, బాలునాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement