కందుకూరు: ఫ్యూచర్‌సిటీలో నిర్మించిన ఎఫ్‌సీడీఏ భవనం ప్రారంభోత్సవంతో పాటు ఆ సమీపంలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టారు. ఎఫ్‌సీడీఏ భవనంలో పచ్చదనం కనిపించేలా మొక్కలు నాటడం, గడ్డిపరిచే పనులు చేపట్టారు. భవనం వెనుక వైపు ఉన్న ప్రాంతంలో సభ కోసం పెద్దపెద్ద షెడ్లు వేస్తున్నారు. మరోవైపు జనాలు భారీగా సభకు వచ్చేలా కాంగ్రెస్ పెద్దలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఏఫ్‌సీడీఏ భవనంతో పాటు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.


