డీసీహెచ్‌ఎస్ అనురాగిణి
చేవెళ్ల: చేవెళ్ల ఆస్పత్రిలో నిలిచిపోయిన డయాలసిస్ సేవలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని డీసీహె చ్‌ఎస్ అనురాగిణి అన్నారు. డయాల సిస్ సేవలు నిలిచిపోయినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సోమవారం ఆమె ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. డయాలసి స్ రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా పాలియేటివ్ కేర్ కేంద్రంలో సేవలను కొనసాగించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు. వారంరోజుల్లో యథావిధిగా సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారి వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతావెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాములుగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజఆగిరెడ్డి, ఎం.శ్రీనివాస్, తాళ్లపల్లి, నర్సింలు, కృష్ణానాయక్ తదితరులు ఉన్నారు.
పంటలు ఎండిపోకుండా చూడండి
అసెంబ్లీలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా చూడాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు వనపర్తి నియోజకవర్గంలోని బుద్ధారం వరకు వస్తున్నాయని, ఇక్కడ ఐదు మోటార్‌లకు గాను 3 మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. వేరుశనగ పంట తీయడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, 15 రోజులుగా నీరు రావడం లేదన్నారు. కల్వకుర్తి రైతులకు వెంటనే సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరారు.


