మొయినాబాద్: మున్సిపల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మొయినాబాద్ పీహెచ్‌సీలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సోనియాదర్శన్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీతో పాటు వివిధ గ్రామాల నుంచి 368 మంది ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గైనకాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, ఆర్థోపె డిక్, చిన్నపిల్లల స్పెషలిస్టు వైద్యులు వచ్చినవారికి వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ లలితాదేవి, ప్రోగ్రాం అధికారి పూనం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్, మండల వైద్యాధికారి అన్నపూర్ణ, ఎంపీడీఓ సంధ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గరుగు రాజు, కౌన్సిలర్లు గీతావనజాక్షి, జగపతి, సీహెచ్‌ఓ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ యాదయ్య, నాయకులు షాబాద్ దర్శన్, రాంచందర్, సూరి, యాదగిరి, కిరణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


