శంకర్‌పల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం శంకర్‌పల్లి చౌరస్తాలో మండలాధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా కేంద్రం గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుడిని ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఇప్పటికై నా గ్యాస్ సిలిండర్ల కొరతను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు మహిపాల్, నాయకులు ఎజాస్, శశికాంత్, చందు, సత్యనారాయణ, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దొరకని గ్యాస్.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మంటలు మన టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లను తాకాయి.
Mar 16 2026 8:55 AM | Updated on Mar 16 2026 8:55 AM
దొరకని గ్యాస్.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మంటలు మన టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లను తాకాయి. 8లోu గ్యాస్ సరఫరాలో కేంద్రం విఫలం
Advertisement
Advertisement


