మొయినాబాద్: గ్యాస్ సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ గౌతమ్‌కుమార్ గ్యాస్ ఏజెన్సీలను హెచ్చరించారు. శనివారం ఆయన మొయినాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ రాజేష్, సిబ్బంది ఉన్నారు.
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అ దృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన ప్రకారం.. వాదే ముస్తఫా బస్తీకి చెందిన మహ్మద్ అలీ కుమార్తె జీనత్ ఫాతిమా(18) పదో తరగతి వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 13వ తేదీన తల్లి నిద్రిస్తున్న సమయంలో జీనత్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. యువతి సోదరి నుస్రత్ ఫాతిమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జాడ తెలిసిన వారు పీఎస్‌లో గాని 87126 62367 నంబర్‌లోగానీ సమాచారం ఇవ్వాలని కోరారు.


