కొందుర్గు: తమ ఆర్థిక లాభాల కోసం ఆమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద రాజకీయాన్ని విడనాడి ప్రపంచ శాంతిని కాపాడాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట సభ్యుడు ఆకాశ్‌నాయక్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమెరికా ప్రపంచ దేశాల మధ్య చిచ్చుపెడుతుందన్నారు. యుద్ధాలతో విద్య, వైద్య రంగాలకు అందాల్సిన నిధులు ఆయుధాల పాలవుతున్నాయన్నారు. ఇప్పటికై నా యుద్ధం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బాబా, శివ, జాకీర్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.


