మూసీ భూ సేకరణలో రైతులకు న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

మూసీ భూ సేకరణలో రైతులకు న్యాయం చేస్తాం

Feb 20 2026 11:08 AM | Updated on Feb 20 2026 11:08 AM

మూసీ భూ సేకరణలో  రైతులకు న్యాయం చేస్తాం

మూసీ భూ సేకరణలో రైతులకు న్యాయం చేస్తాం

శాస్త్రిపురం: మూసీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు సంబంధించి ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని రాజేంద్రనగర్‌ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం హైదర్‌గూడలో మూసీ డెవలప్‌మెంట్‌ గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాము కోల్పోయిన భూములకు నష్ట పరిహారంగా భూములే ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ భూముల్లో కాయగూరలు, ఆకుకూరలు పండించుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఆర్డీవో వెంకట్‌రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement