డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన శిరీష
నందిగామ: షాద్‌నగర్ జోన్ డీసీపీగా సీహెచ్ శిరీష శుక్రవారం నందిగామ పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జోన్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి పోలీసు కృషి చేయాలని, ప్రజలకు చేరువగా ఉంటూ సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌హెచ్‌ఓలు ప్రసాద్, నర్సయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో నూతనంగా కార్యాలయం ఏర్పాటయ్యే వరకు నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయం నుంచి శిరీష విధులు నిర్వర్తించనున్నారు.
తుక్కుగూడ: మున్సిపల్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాము పడుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని మండలి చైర్మన్‌ను కోరినట్టు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ట్రెజరర్ శ్రీధర్‌రెడ్డి, టీఎన్‌జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.పర్వతాలు తదితరులు ఉన్నారు.
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని సాకిబండతండాలో శుక్రవారం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మరోసారి గిరిజన రైతులు అడ్డుకున్నారు. తండాలో సర్వే కోసం రెవెన్యూ అధికారులతో పాటు వివిద శాఖల అధికారులు రావడంతో రైతులు తమకు ఇచ్చే నష్టపరిహారం తేల్చిన తరువాతే సర్వే జరపాలని కోరారు. ఆమనగల్లు తహసీల్దార్ ఫయీంఖాద్రితో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్ మాట్లాడారు. రైతులకు నష్టపరిహారం ప్రకటించాకే సర్వే చేయాలని సూచించారు.
సర్వేను వెంటనే నిలిపివేయండి
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు సర్వే పనులను వెంటనే నిలిపివేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు జర్పుల దశరథ్‌నాయక్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఎక్వాయిపల్లి సమీపంలో శుక్రవారం గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు సర్వే పనులు చేపడుతున్నారనే సమాచారం అందుకున్న ఆయన అక్కడికి చేరుకున్నారు. నిర్వాసితులతో కలిసి వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనునాయక్, కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: సేవే లక్ష్యంగా కమ్మ సంఘం నాయకులు ముందుకు సాగాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్‌రావు పిలుపునిచ్చారు. పట్టణ శివారులోని ఎన్‌హెచ్ 44 హోటల్‌లో శుక్రవారం కమ్మ సమైఖ్య వేదిక ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభేదాలను పక్కనపెట్టి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. కమ్మజాతి అభ్యున్నతికి, కార్పొరేషన్ ఏర్పాటు కోసం పని చేయాలన్నారు. కార్యక్రమంలో కమ్మ సమైఖ్య వేదిక డివిజన్ కమిటీ అధ్యక్షుడు మన్నవసాంబ శివరావు, ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ, కోశాధికారి కాపా వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన శిరీష
డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన శిరీష
డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన శిరీష


