కుటుంబసభ్యుల చెంతకు మతిస్థిమితం లేని మహిళ
మొయినాబాద్‌రూరల్: మతిస్థిమితం లేని మహిళలను పోలీసులు కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. వివరాలివీ.. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్డిపల్లిలో మతిస్థిమితం లేకుండా ఓ మహిళ తిరుగుతుండగా పెట్రోలింగ్ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమె వద్ద లభించిన ఓ పాకెట్ డైరీలో ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమెను వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ గ్రామానికి చెందిన వడ్ల శ్రీదేవి (45)గా గుర్తించారు. సమాచారం అందుకున్న ఆమె కుమారుడు శనివారం పోలీస్‌స్టేషన్‌కు రాగా పోలీసులు అతనికి అప్పగించారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
యాచారం: విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్‌గౌడ్ (42) యాచారం మండలం మాల్‌లోని సాగర్ రోడ్డు పక్కన ఇంటి నిర్మాణం చేపట్టాడు. శనివారం పనులను పరిశీలిస్తుండగా గోడలకు సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదకరంగా ఉన్న వైర్లను తొలగించాలని పలుమార్లు ఆశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు సాగర్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మధు తెలిపారు.
సిటీకి చెత్త సమస్యలు
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెత్త సమస్యలు తీవ్రం కానున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నగరంలోని చెత్తతోపాటు, శివారు మున్సిపాలిటీల చెత్తనూ జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకే తరలిస్తున్నారు. జవహర్‌నగర్ సమ స్యపై కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లడంతో జవహర్‌నగర్‌కు చెత్త తరలింపు నిలిపివేయా లని ఆదేశించినట్లు తెలిసింది. ఈ అంశంపై సోమ వారం ఫైనల్ హియరింగ్ జరగనున్నట్లు సమాచారం. నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ వెలువరించే ఆదేశాల కనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు.
కుటుంబసభ్యుల చెంతకు మతిస్థిమితం లేని మహిళ


