ఒక్కో ఊరు.. ఒక్కో ఠాణా!
ఒక్కో పోలీస్‌స్టేషన్ పరిధిలోకి ఆయా గ్రామాలు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక అయోమయం తుక్కుగూడలో ప్రత్యేక ఠాణా ఏర్పాటుకు వినతులు
తుక్కుగూడ: నగరానికి చేరువలో ఉన్న మున్సిపల్ పరిధిలో శ్రీశైలం జాతీయ రహదారి, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్– 14, ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్, మంఖాల్ పారిశ్రామికవాడ, వండర్‌లా లాంటి వినోద కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతూ రద్దీగా ఉంటాయి. ఠాణా కోసం స్థానిక ప్రజలు మూడేళ్లుగా ఎదురు చూస్తు న్నారు. గత ప్రభుత్వ హయాంలో తుక్కుగూడను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. కానీ ప్రత్యేక పోలీస్ స్టేషన్ మాత్రం లేదు. మున్సిపల్ పరిధిలోని తుక్కుగూడ, సర్ధార్‌నగర్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తే, రావిర్యాల ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల ఠాణా పరిధిలోకి.. ఇమామ్‌గూడ సగ భాగం పహాడీపరీష్ పోలీస్ స్టేషన్‌కి, మిగతా సగం (రాంకీ, కావూరి, ప్రజయ్ విల్లా లు) మహేశ్వరం ఠాణా పరిధిలోకి వస్తాయి. ఒక్కో గ్రామం ఒక్కో స్టేషన్ పరిధిలో కొనసాగుతున్నా యి. ఏదైనా ప్రమాదం జరిగినా.. అనుకోని ఘటనలు జరిగినా ఏ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయా లో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అద్దె భవనంలో డీసీపీ, ఏసీపీ కార్యాలయాలు
గతంలో మహేశ్వరం నియోజకవర్గం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బీనగర్ డీసీపీ, ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోకి వచ్చేది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం మహేశ్వరానికి ప్రత్యేకంగా డీసీపీ, ఏసీపీ అధికారులను కేటాయించారు. ప్రస్తుతం రెండు కార్యాలయాలు తుక్కుగూడ మున్సిపల్ కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. డీసీపీ నూతన భవనం నిర్మాణ పనులకు ఏడాది క్రితం జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు పోలీస్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. తుక్కుగూడలో ప్రత్యేక ఠాణా ఏర్పాటు చేయాలని తుక్కుగూడ పాలక మండలి సభ్యులు (కౌన్సిలర్లు) మంత్రికి వినతిపత్రం అందజేశారు. పనులు మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
ప్రత్యేక ఠాణా ఏర్పాటు చేయాలి
తుక్కుగూడను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినప్పటికీ ప్రత్యేక పోలీస్‌సేష్టన్ లేదు. ఒక్కో ఊరు ఒక్కో ఠాణా పరిధిలోకి వస్తాయి. అధికారులు స్పందించి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.
– బాకారం వెంకట్ రాజిరెడ్డి, తుక్కుగూడ
ఒక్కో ఊరు.. ఒక్కో ఠాణా!


