ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
కందుకూరు: సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యులు బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్.వెంకట్‌రాంరెడ్డి, మాజీ చైర్మన్ ఎస్.మల్లేష్, డైరెక్టర్లు యుగంధర్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రశాంత్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఎస్.పాండు, యూత్ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, సీనియర్ నాయకులు వీరారెడ్డి, సమంత, మహేందర్, కె.వెంకటేశ్, గోవర్ధన్‌రెడ్డి, నర్సింహ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కస్తూర్బాగాంధీ పాఠశాలలో..
మండలంలోని కొత్తగూడ పరిధిలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో కాంగ్రెస్ నాయకులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ మండల కోఆర్డినేటర్ ఎండీ అఫ్జల్‌బేగ్, మాజీ ఉప సర్పంచ్‌లు జి.ప్రభాకర్‌రెడ్డి, జి.సుధాకర్‌రెడ్డి, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విఠల్‌రెడ్డి, నాయకులు నర్సింహ, రాములుగౌడ్, రాములుయాదవ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా మైసిగండి
బ్రహ్మోత్సవాలు
కడ్తాల్: మైసిగండి మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు శనివారం ఆలయంలో వేదపడింతుల మంత్రోచ్చరణల మధ్య సహస్ర చండీయాగం, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. మాజీ ఎంపీ పోతుగంటి రాములు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ స్నేహలత, ట్రస్టీ శిరోలీ, తహసీల్దార్ జ్యోతి, ఆలయ నిర్వాహకులు, అర్చక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీకి ఎంపిక
చేవెళ్ల: జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో ఆడేందుకు ఆ లూరుకు చెందిన నాగచైతన్య ఎంపికయ్యా డు. ప్రభుత్వం ఇటీవ ల పాఠశాలల స్థాయి లో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా వివిధ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన నాగచైతన్య నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో భాగంగా అండర్ –17 విభాగంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాడు. జోనల్, జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లో జరిగే పోటీల్లో పాల్గొననున్నాడు.
రేషన్ బియ్యంలో పూసలు
కేశంపేట: రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలో తలంబ్రాల్లో కలిపే పూసలు కనిపించాయి. మండల పరిధిలోని లింగంధన, తొమ్మిదిరేకుల గ్రామాల్లోని రేషన్ దుకాణాల ద్వారా డీలర్లు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. శనివారం యథావిధిగా బియ్యం పంపిణీ చేస్తుండగా బస్తాల్లో పెళ్లి తలంబ్రాల్లో కలిపే పూసలు, థర్మాకోల్ బాల్స్ కనిపించడంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. లింగంధనలో నాలుగు బస్తాల్లో, తొమ్మిదిరేకులలో ఒక బస్తాలో అలాగే ఉన్నాయి. డీలర్లు వెంటనే తహసీల్దార్‌కు సమాచారం అందించారు. అలా వచ్చిన బియ్యం సంచులను పక్కన పెట్టాలని తహసీల్దార్ వారికి సూచించారు.
ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు


