
లయన్స్‌క్లబ్ సేవలు వినియోగించుకోండి
కడ్తాల్: లయన్స్‌క్లబ్ సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ చెన్నకిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం ప్రధాన కూడలిలో క్లబ్ ఆఫ్ ఆమనగల్లు– బాలాజీనగర్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 450 మందికి అన్నదానం చేశారు. ఇందులో క్లబ్ ఆమనగల్లు అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, కార్యదర్శి గంపశ్రీను, పీఆర్‌ఓ పాష, సభ్యులు వెంకటేశ్, చేగూరి వెంకటేశ్, రాజేందర్‌యాదవ్, బీచ్యానాయక్, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
స్థానిక ఎన్నికలపై శిక్షణ
మంచాల: నిబంధనల మేరకు ఎన్నికల నియమావళిని అమలు పర్చాలని ఎంపీడీఓ బాలశంకర్ అన్నారు. సోమవారం మండల కార్యాలయంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు, వాటి అమలు తీరుపై అధికారులకు అవగాహన కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, సూపరిండెంట్ అజిమ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రోడ్డు పక్కకు ఒరిగిన లారీ
తుర్కయంజాల్: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. ఓ లారీ రోడ్డు పక్కకు ఒరిగింది. దారి సమాంతరంగా లేకపోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సాగర్ రహదారి నుంచి సబ్‌స్టేషన్ మీదుగా తుర్కయంజాల్ గ్రామానికి వచ్చే రోడ్డును హెచ్‌ఎండీఏ నిధులతో ఆర్‌అండ్‌బి అధికారులు నిర్మించారు. నిర్మాణం పూర్తయి మూడు నెలలు అవుతున్నా.. రోడ్డుకు ఇరువైపులా సమాంతరంగా మట్టి పోయలేదు.దీంతో సోమవారం లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు దిగువకు ఒరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును సమాంతరం చేయాలని వాహనదారులుకోరుతున్నారు.
మాడ్గులకు కృష్ణా జలాలు
మాడ్గుల: దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న కృష్ణా జలాల కల నెరవేరింది. ఎట్టకేలకు సోమవారం డి–82 కాల్వల ద్వారా కృష్ణా జలాలు రావడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, నాయకులు కష్ణా జలాలకు దోడ్లపహడ్ గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిచిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విజయ డెయిరీ చైర్మన్ బొజ్జ సాయిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ జంగయ్య గౌడ్, నాయకులు కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

లయన్స్‌క్లబ్ సేవలు వినియోగించుకోండి