
ఘనంగా అ‘పూర్వ’ సమ్మేళనం
కడ్తాల్: అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఎక్కడెక్కడో స్థిరపడిన బ్యాలమిత్రులంతా మూడు దశాబ్దాల అనంతరం ఒకే వేదికగా సందడి చేశారు. ఆప్యాయంగా పలకరించుకుంటూ, నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. ఆటపాటలతో సందడి చేశారు. మండల పరిధి మైసిగండిలోని ఓ కన్వెన్షన్‌హాలులో సోమవారం కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1995– 96 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన నాటి విద్యార్థులు.. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న 65 మంది చిననాటి స్నేహితులంతా క్షేమసమాచారం తెలుసుకున్నారు. వారి మధ్య లేని వారిని గుర్తుకు చేకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాటి విదార్థుల్లో ఒకరైన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ మాట్లాడుతూ.. చదువు విషయంలో ఎవరికి ఎలాంటి సహకారం కావలన్నా.. అందిస్తానని తెలిపారు. అనంతరం ఆయనను మిత్రబృందం సన్మానించింది. కార్యక్రమంలో యాదయ్య, రాఘవేందర్, ఆంజనేయులు, బాలస్వామి, చంద్రయ్య, బాలరాజు, జంగయ్య, బాలయ్య, కిరణ్, వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుల్తాన్ గఫార్, శ్రీను, అచ్చయ్య, దాస్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అ‘పూర్వ’ సమ్మేళనం