
రుణాలు సకాలంలో చెల్లించండి
మంచాల: రుణాలు సకాలంలో చెల్లించి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) అభివృద్ధికి సహకరించాలని సంఘం చైర్మన్ వెదెరె హన్మంత్‌రెడ్డి అన్నారు. సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా రూ.50 లక్షలు పంట రుణాలు అందించామని తెలిపారు. గతంలో తీసుకున్న రుణ బకాయి రూ.34 కోట్లు ఉందని, వాటిని త్వరగా చెల్లిస్తే కొత్తగా రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సంఘం అభివృద్ధిలో భాగంగా మార్పులు తప్పనిసరన్నారు. ఆరుట్లలో రూ.50 లక్షలతో మార్కెట్ ఏర్పాటు చేశామని, రైతుల సహకారంలో పాల సేకరణ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ బోద్రమోని యాదయ్య, డైరెక్టర్లు సత్యనారాయణ, అరుణమ్మ, జెనిగె వెంకటేశ్, పి.రమేష్, సంఘం సీఈఓ రమేష్, క్యాషియర్ సంతోష్, క్లర్క్ లింగం, సేల్స్‌మెన్ పి.శ్రీకాంత్, సిబ్బంది బుగ్గరాములు, రంగయ్య, సద్గుణ తదితరులు పాల్గొన్నారు.
పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి