
ఆలయాభివృద్ధికి వేతనం వితరణ
యాచారం: కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న నందివనపర్తి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాభివృద్ధికి ఓ యువకుడు తన మొదటి నెల జీతాన్ని విరాళంగా ఇచ్చి, మొక్కు తీర్చుకున్నాడు. యాచారం గ్రామానికి చెందిన వూరె రజిత, శ్రీనువాస్‌గుప్తా దంపతుల కుమారుడు సాయి తనీష్ యూఎస్‌ఏలో ఎంఎస్ చదివి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. అమ్మవారి దయతోనే విదేశంలో కొలువు వచ్చిందని భావించి, కుటుంబీకులతో కలిసి సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విరాళంగా నెల జీతం రూ.2,91,699లను ఆలయ ఫౌండర్ సదా వెంకట్‌రెడ్డికి అందజేశారు. భవిష్యత్తులో మరింత సహాయపడతానని తెలిపారు. అనంతరం సాయి కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.