
హైటెన్షన్ లైన్ మార్చండి
కడ్తాల్: వ్యవసాయ పొలాల మీదుగా తీస్తున్న 765కేవీ హైటెన్షన్ సోలార్ విద్యుత్ లైన్ అలైన్‌మెంట్‌ను మార్చాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరుతూ బాధిత రైతులు చేస్తున్న దీక్ష సోమవారానికి 22వ రోజుకు చేరుకుంది. దీక్షకు బీజేపీ మండల అధ్యక్షుడు మహేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్ సంఘీభావం తెలిపారు. ఇందులో సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటేశ్, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, పాండు లక్ష్మణ్, గోరటి కృష్ణ, రాములుయాదవ్, రాజేందర్, పర్వత్‌కుమార్, పెంటారెడ్డి, జంగయ్యయాదవ్, వెంకట్‌రాములుగౌడ్ ఉన్నారు
ఎమ్మెల్యేను కలిసిన ఉద్యమకారులు
ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని తెలంగాణ ఉద్యమకారులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలాన్ని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేస్తానని చెప్పారు. ఇందులో ఉద్యమకారులు శ్రీనివాస్, జగదీశ్వర్‌యాదవ్, యాదగిరిరెడ్డి, విష్ణువర్ధన్, వీరేశ్‌కుమార్, లక్ష్మణ్, గోపాల్, నారాయణరెడ్డి, జంగయ్యగౌడ్, శివలింగం, బాబులాల్, ఎండీ అస్లం పాల్గొన్నారు.