
డయాలసిస్ పేషంట్ల కోసం ‘ఆశాయే ఇన్’
సాక్షి, సిటీబ్యూరో: డయాలసిస్ సేవలందించే ప్రముఖ సంస్థ నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో నగరంలోని డయాలసిస్ పేషంట్ల కోసం ‘ఆశాయే ఇన్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా పేషంట్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డయాలసిస్ పేషంట్ల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకులు కమల్ డి.షా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులు డయాలసిస్ చేయించుకుంటూనే రోజువారీ సాధారణ జీవితం గడిపేందుకు, డయాలసిస్ డైట్‌లో ఉంటూనే ఆహారాన్ని ఆస్వాదించేందుకు, క్షేమంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పేషెంట్లకు వివరించారు.