
ఏఎంసీ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడిగా పెంటయ్యగౌడ్
చేవెళ్ల: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా చేవెళ్ల ఏఎంసీ చైర్మన్ జి.పెంటయ్యగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించారని చెప్పారు. చైర్మన్‌గా టి.మల్లేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడిగా కె.వేణుగౌడ్, ప్రధాన కార్యదర్శిగా జి.మాధవరెడ్డి, జాయింట్ సెక్రటరీగా బి.ఆంజనేయులు ఎన్నికయ్యారని చెప్పారు. నూతన కమిటీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిశామన్నారు.