
లేఅవుట్‌లో అవకతవకలపై విచారణ
కందుకూరు: ముచ్చర్లలోని ఫార్చ్యూన్ హోమ్స్ లేఅవుట్‌లో అవకతవకలపై మంగళవారం షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ ఢీల్లీలో విచారణ జరిపింది. వెంచర్ నిర్వాహకుడు రోసిరెడ్డి ఫార్చ్యూన్ హోమ్స్ పేరుతో ప్లాట్లను అమ్ముతామని చెప్పి మధ్యవర్తులు దేవీలాల్, పాండు ద్వారా షెడ్యూల్ తెగల వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని అగ్రిమెంట్లు చేసి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా వేధిస్తున్నారని బాధితులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జాతీయ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజును పిలిపించి విచారణ జరిపారు. అవకతవకలు నిజమేనని వారు తెలిపారు. మరోసారి అన్ని విషయాలతో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కమిషన్ సభ్యుడు ఆదేశించినట్లు ఆర్డీఓ తెలిపారు.