ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు

Sep 10 2025 6:29 AM | Updated on Sep 10 2025 7:33 AM

ఆయిల్

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు ఆమనగల్లు: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సురేశ్‌ తెలిపారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్‌ అందిస్తున్నట్లు చెప్పారు. పంటసాగుకు అవసరమైన ఎరువుల కోసం ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు మొత్తం రూ.16,800 చెల్లించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాకు కేటాయించిన ఆయిల్‌ వ్యాల్యు కంపెనీ ఒప్పందం మేరకు రైతులు సాగు చేసిన పంటను కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఏడీ కిషన్‌, షాద్‌నగర్‌ డివిజన్‌ అధికారి హిమబిందు, హెచ్‌ఈఓ సీతారాం, ఆయిల్‌ వ్యాల్యూకంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ రామ్మోహన్‌రావ్‌, ఏరియా మేనేజర్‌ ప్రమోద్‌కుమార్‌, ఫీల్డ్‌ఆఫీసర్‌ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి నేడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు

చేవెళ్ల: మద్యం తాగి వాహనాలు నడపకూడదని, దీంతో వారి ప్రాణాలతోపాటు ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదమని రిటైర్డు జడ్జి సాంబశివరావు అన్నారు. చేవెళ్ల కోర్టు ఆవరణలో మంగళవారం రెండో రోజు ట్రాఫిక్‌ పోలీస్‌ కేసుల లోక్‌ అదాలత్‌ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలన్నారు. పెండింగ్‌ కేసులను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసిన లోక అదాలత్‌ ఈనెల 13వ తేదీ వరకు కొనసాగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకటేశం, ఏఎస్‌ఐ చందర్‌నాయక్‌, కానిస్టేబుళ్లు జంగయ్య, కవిత తదితరులు పాల్గొన్నారు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం 10 గంటలకు కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 159 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై నట్లు తెలిపారు.

మొయినాబాద్‌: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికై న సీపీ రాధాకృష్ణన్‌కు చిలుకూరు బాలాజీ దేవాలయం తరఫున అర్చకుడు రంగరాజన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సరం రాధాకృష్ణన్‌ చిలుకూరు ఆలయాన్ని దర్శించుకున్న సందర్భాన్ని గుర్తుచేశారు. మంగళవారం ఉపరాష్ట్రపతిగా ఎన్నికై న అనంతరం మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణన్‌ ప్రజాసేవకు సమర్పించిన జీవితం, ధర్మం, నైతికత, భారతీయ సంస్కృతిని గుర్తుచేస్తూ ఆయన అంకితభావం దేశానికి గర్వకారణం అన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా బాలాజీ ఆశీస్సులు ఎల్లప్పుడు ఆయనకు ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నామన్నారు.

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు 
1
1/2

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు 
2
2/2

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement