చిలుకూరు ఆలయం మూసివేత | - | Sakshi
Sakshi News home page

చిలుకూరు ఆలయం మూసివేత

Sep 8 2025 9:39 AM | Updated on Sep 8 2025 9:39 AM

చిలుక

చిలుకూరు ఆలయం మూసివేత

మొయినాబాద్‌: చంద్ర గ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఆదివారం సాయంత్రం మూసివేశారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. రాత్రి చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. గర్భగుడి తలుపులు మూసి తాళాలు వేశారు. ఆలయ గోపురం ప్రధాన ద్వారాన్ని సైతం మూసివేశారు. గ్రహణం తరువాత సోమవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరువనున్నారు. స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్టు అర్చకుడు రంగరాజన్‌ తెలిపారు.

మైసిగండి మైసమ్మ ఆలయం ..

కడ్తాల్‌: చంద్రగ్రహణం సందర్భంగా మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వాహకులు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఉదయం 8 గంటలకు ఆలయ సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం తిరిగి భక్తుల దర్శనానికి అనుమతి కల్పించనున్నట్టు తెలిపారు.

చిలుకూరు ఆలయం మూసివేత1
1/1

చిలుకూరు ఆలయం మూసివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement