
అధ్వానరోడ్డుతో అవస్థలు
మరమ్మతు చేయించండి: కమిషనర్‌కు విన్నపం
తుర్కయంజాల్: ఇంజాపూర్– హయత్‌నగర్ అధ్వాన రోడ్డుతో అవస్థలు పడుతున్నామని, వెంటనే మరమ్మతు చేయించాలని పలువురు నాయకులు కోరారు. గురువారం మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని, భారీ వాహనాల రాకపోకలతో గుంతలు ఏర్పడి, ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీధర్ రెడ్డి, రాజు, విజయ్, రాజ్ కుమార్, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.