పిల్లలతో సహా గృహిణి అదృశ్యం

యాచారం: భర్త వేధింపులు తట్టుకులేక ఓ గృహిణి పిల్లలతో సహా అదృశ్యమైంది. ఈ ఘటన మాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చీరమోని నాగమ్మ పెద్ద కూతురు మల్లేశ్వరిరని అదే గ్రామానికి చెందిన కాటమోని గణేశ్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసింది. వీరికి రేణుక, నందు సంతానం. ఈ నెల 25న మల్లేశ్వరి తల్లికి ఫోన్‌ చేసి భర్త వేధిస్తున్నాడని ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఆమె తల్లి వచ్చే లోపే ఇద్దరు పిల్లలతో సహా వెళ్లిపోయింది. రెండు రోజులుగా బంధువులు, చుట్టు పక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో నాగమ్మ సోమవారం యాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్‌ : సీఐ

కొత్తూరు: గంజాయి తరలిస్తున్న ముఠాను గతేడాది పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని న్యాయమూర్తి జైలుకు తరలించగా బెయిల్‌పై బయటకు వచ్చారు. దీంతో వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి మరోమారు జైలుకు తరలించినట్లు సీఐ బాలరాజు సోమవారం తెలిపా రు. వివరాల ప్రకారం.. విశాఖ ఏజె న్సీ సీలేరు నుంచి సేకరించిన గంజా యి కార్లలో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఈ ముఠాను గతేడాది జనవరి 27న కొత్తూరులో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 214 కిలోల గంజాయి, ఐదు సెల్‌ఫోన్లు, మూడు కార్లు, రూ.2.10 లక్ష ల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇందులో మహరాష్ట్రకు చెందిన బాబా సౌ చెందేకర్‌, తిరుమలిబాబు, గణేశ్‌, రాజేంద్ర అహడేలు నేరానికి పాల్పడ్డట్లు సీఐ తెలిపారు. వీరిలో తిరుమల్‌బాబు ఫిబ్రవరిలో మృతి చెందాడు.

షార్ట్‌ సర్క్యూట్‌తో డీసీఎంలో మంటలు

శంషాబాద్‌: ప్రమాదవశాత్తు కుర్చీల లోడు లారీ దగ్ధమైన ఘటన ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం హయత్‌నగర్‌కు చెందిన డీసీఎం గగన్‌పహాడ్‌లోని పారిశ్రామికవాడలో ఓ కంపెనీలోని కుర్చీలను లోడ్‌ చేశారు. జాతీయరహదారికి పైకి వచ్చిన డీసీఎంలోని క్యాబిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. దీంతో డ్రైవర్‌ అప్రమత్తమై మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కుర్చీలన్నింటికీ మంటలు అంటుకు ని పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫైరింజన్‌ను రప్పించి మంటలను ఆర్పివేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top