ఆర్యవైశ్యులు పోటీ చేయాలి
హుడాకాంప్లెక్స్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అవకాశం ఉన్నచోట ఆర్యవైశ్యులు పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం మంద మల్లమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్‌లో నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవాది మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో 300 డివిజన్లు ఏర్పాటు కావడంతో అవకాశం ఉన్నచోట ఆర్యవైశ్యులు పోటీ చేయాలని కోరారు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆర్యవైశ్యులు గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గందె సురేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి బిల్ల కంటి కిరణ్ కుమార్ గుప్తా, రాష్ట్ర నాయకుడు ఊరే లక్ష్మణ్ గుప్తా, జిల్లా మాజీ అధ్యక్షుడు అర్థం లక్ష్మయ్య, జిల్లా ఆర్యవైశ్య సంఘం సేవాదళ్ అధ్యక్షుడు మహేశ్ గుప్తా, జిల్లా విద్యా కమిటీ చైర్మన్ నాగ బండి నగేష్ గుప్తా, రాజకీయ కమిటీ చైర్మన్ కొత్త రవికుమార్ గుప్తా, నిర్వాహకులు పాల్గొన్నారు.
ముగిసిన అథ్లెటిక్స్ పోటీలు
ద్వితీయస్థానంలో రంగారెడ్డి
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ మాస్టర్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్ షిప్‌ను మేడ్చల్ జిల్లా జట్టు కై వసం చేసుకుంది. రన్నరఫ్‌గా రంగారెడ్డి జిల్లా జట్టు నిలిచింది. విజేతలకు తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్ గౌడ్ ట్రోఫీలు ప్రదానం చేశారు. 18 జిల్లాల నుంచి సుమారు 900 మందికి పైగా 30 నుంచి 90 సంవత్సరాల వయస్సు వారు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. రాణించిన మాస్టర్ అథ్లెట్లను జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు.
చాంపియన్ మేడ్చల్..
పోటీల్లో రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో రాణించి ఎక్కువ పతకాలు కై వసం చేసుకున్న మేడ్చల్ జిల్లా జట్టు 581 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు 252పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. పురుషుల విభాగంలో మేడ్చల్ 250 పాయింట్లతో, మహిళల విభాగంలో మేడ్చల్ 331పాయింట్లతో చాంపియన్ షిప్ కై వసం చేసుకున్నాయి.
కబడ్డీ విజేతలు వీరే
● రన్నర్‌గా రంగారెడ్డి జిల్లా
● ముగిసిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో కబడ్డీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజలు పాటు జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యపేట జిల్లా జట్టు ఛాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకోగా.. మహిళల విభాగంలో హైదరాబాద్–2 జట్టు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రన్నర్‌గా జోగులాంబ గద్వాల్ జట్టు, తృతీయస్థానాల్లో నిజామాబాద్, నాగర్ కర్నూల్ నిలిచాయి. మహిళల విభాగంలో రన్నర్‌గా రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానాల్లో వరంగల్, ఖమ్మం జట్లు నిలిచాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు రెండు ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పోటీలతో కబ్డడీకి మరింత క్రేజ్ వచ్చిందన్నారు. మహిళల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతాయని, ఇక్కడ రాణించిన క్రీడాకారులను తెలంగాణ జట్లకు ఎంపిక చేసినట్లు కబడ్డీ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్‌రెడ్డి తెలిపారు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్‌రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, సంఘం జిల్లా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అమిత్ కుమార్, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.
ఆర్యవైశ్యులు పోటీ చేయాలి


