ఎండలు మండుతున్నా యువకులు ఉత్సాహంగా క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఉదయం, సాయంత్రం ఎండ తక్కువగా ఉన్నప్పుడే పోటీలు నిర్వహిస్తున్నాం. సిరిసిల్లలో క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆటగాళ్లు తమ క్రీడానైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ పేరిట క్రికెట్ పోటీల నిర్వహణతో యువకులతో మేం మమేకమయ్యాం. ఇది మంచి పరిణామం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల్లోనూ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు.
– జిందం చక్రపాణి,
బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు


