బోయినపల్లి(చొప్పదండి): ఉపాధిహామీ కూలీలు పని చేసే ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీవో గీత అన్నారు. బోయినపల్లి మండలంలోని మల్కాపూర్, బోయినపల్లి, రామన్నపేట గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం పరిశీలించారు. కూలీలకు పని వద్ద సౌకర్యాల ఏర్పాటు తప్పనిసరి అన్నారు. అలాగే ఎన్‌ఎంఎంఎస్ హాజరు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. డీఆర్డీవో వెంట ఎంపీడీవో బీమా జయశీల, బోయినపల్లి సర్పంచ్ నల్ల మోహన్, ఈజీఎస్ ఏపీవో వనం సబిత, పంచాయతీ కార్యదర్శులు, ఈసీలు, టీఏ, ఎఫ్‌ఏలున్నారు.


