వీర్నపల్లి: అటవీ సంపదనకు కాపాడుకోవడంతో పాటు వన్యప్రాణులను సంరక్షించడం ప్రతిఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ బీట్ అధికారి కిరణ్ అన్నారు. బుధవారం వీర్నపల్లి మండలం బాబాయి చెరువుతండాలో ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో అటవీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఉపాధి పనులు చేసే సమయంలో కూలీలు వన్యప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణులు కనిపిస్తే వాటికి ఎటువంటి హాని తలపెట్టకుండా అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. అటవీ శాఖ సిబ్బందితో పాటు గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


