సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై సిరిసిల్ల నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, బూట్ల నవీన్ మాట్లాడారు. పవర్‌లూమ్ పరిశ్రమకు కొనసాగుతున్న కేటగిరీ–3 మీటర్లను తొలగించి కేటగిరీ–4 అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, గోవిందు రవి తదితరులు పాల్గొన్నారు.


