సాగుపనుల్లో ఉపయోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాగుపనుల్లో ఉపయోగించుకోవాలి

Apr 8 2026 7:02 AM | Updated on Apr 8 2026 7:02 AM

పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు రైతులకు 420 కోడెలు పంపిణీ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడఅర్బన్‌: రాజన్న కోడెలను సంరక్షించి, వ్యవసాయ పనుల్లో ఉపయోగించుకోవాలని ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సూచించారు. పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేములవాడ మున్సిపల్‌ పరి ధి తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలోని 210 జతల కోడెలను మంగళవారం రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజన్న భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు తిప్పాపూర్‌ గోశాలలోని కోడెలను ఉచి తంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోడెలను పక్కదారి పట్టించి, ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అర్హులైన రైతులకు మాత్రమే పంపిణీ

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ మాట్లాడుతూ అర్హులైన రైతులకు మాత్రమే కోడెలు పంపిణీ చేస్తున్నామన్నారు. దరఖాస్తులను వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ, రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు తనిఖీ చేసిన తర్వాతనే అర్హులకు కోడెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కోడెలను అధికారులు తనిఖీ చేస్తారని తెలిపారు. గోశాలలో కోడెల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గడ్డి, నీరు అందిస్తున్నామని, దాదాపు 8 కూలర్లు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement