డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరినా మేం ఎవ్వరికీ ఫోన్లు చేయం. ఎప్పుడైనా తనిఖీల్లో పట్టుబడితే జరిమానాలు విధిస్తాం. గడువు తీరిన లైసెన్స్‌లతో వస్తే నిబంధనల మేరకు జరిమానాలు విధించి లైసెన్స్‌లే కాని, ఇతర ఏ పత్రాల గడువు తీరినా మేం జరిమానాలు విధిస్తాం. ఆర్‌టీవో ఆఫీస్ నుంచి ఎవరికీ ఫోన్లు వెళ్లవు. ఈ విషయంలో ఎవరైనా మా శాఖ పేరు చెప్పి మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. యూపీఏ చెల్లింపులు కాబట్టి మోసగాళ్ల ఆటను సులభంగా కట్టడి చేయవచ్చు.
– వి.లక్ష్మణ్, జిల్లా రవాణాశాఖ అధికారి


