● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హామీలు అమలు చేస్తున్నాం
వేములవాడరూరల్: ప్రజలకు ఇచ్చిన హా మీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకుపోతున్నామని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 1, 2వ వార్డుల్లో రూ.23లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శనివారం భూ మిపూజ చేసి మాట్లాడారు. మున్సిపాలిటీలో విలీనమైన శాత్రాజుపల్లిలో రూ.1.43 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మించినట్లు తెలిపా రు. శాత్రాజుపల్లివార్డును ఒక హబ్‌గా తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్న ఆరేడు గ్రామాలకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందన్నారు. రూ.15లక్షలతో ప్రధాన కూడలి వద్ద జంక్షన్ ఏర్పాటు చేసి సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, నాయకులు సంగ స్వామి, హన్మవ్వ, లింగంపల్లి కిరణ్, పొన్నాల మోహన్, తిరుపతి, కిషన్, అంజయ్య, కొమురయ్య, లక్ష్మీరాజం ఉన్నారు.
వేములవాడఅర్బన్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో పట్టణ పరిధి లోని అర్హులైన 40 మందికి రూ.14 లక్షల సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.


